Mohan Babu: చిరంజీవికి నాకు గొడవలున్నాయి.. కానీ
Mohan Babu Talking About Clashes With Chiranjeevi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవికి మధ్య విబేధాలు ఉన్న విషయం అందరికి తెల్సిందే. లోపల ఎన్ని గొడవలు అయినా ఉండని బయటకు మాత్రం ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే తమ విబేధాల గురించి ఇద్దరు ఎప్పుడు నోరువిప్పిందే లేదు. ఇక తాజాగా ఈ విషయమై మోహన్ బాబు నోరు విప్పాడు. నేడు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విబేధాలపై నోరు విప్పాడు.
నాకు చిరంజీవికి మధ్య గొడవలు ఉన్నాయి. కానీ, మేము ఎప్పుడు అలా ఉండము. ఎప్పుడు ఎదురుపడిన మాట్లాడుకుంటాం. కలుస్తాం. మా గొడవలు.. భార్యాభర్తలమధ్య ఉండే పోట్లాటలాంటివి. ఎంత పోట్లాడుకున్నా.. మళ్లీ కలిసిపోతూ ఉంటాం.ఎక్కడో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని అప్రెంటిస్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి నట జీవితం ప్రారంభించి మోహన్‌బాబు యూనివర్సిటీ ఛాన్స్‌లర్ దాకా వచ్చాను, ఇదంతా ప్రేక్షకుల, అమ్మా అమ్మానాన్నల ఆశీస్సులు. ఇక నా కుటుంబంపై వచ్చే ట్రోల్స్ గురించి నేను పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.