Memu Famous movie Review: అయిపోయినారు పో ఫేమస్.. రచ్చ రచ్చ చేశిళ్లు. యూట్యూబ్‌ల వీడియోలు తీసెటోళ్లు.. వీళ్లేం సినిమాలు తీస్తారన్న వాళ్ల నోళ్లు మూయించిళ్లు. రెండున్నర గంటలు అసలైన పళ్లెటూర్ పోరగాళ్లంటే ఎట్లుంటరో చూపించిళ్లు.
Memu Famous movie Review: అయిపోయినారు పో ఫేమస్.. రచ్చ రచ్చ చేశిళ్లు. యూట్యూబ్‌ల వీడియోలు తీసెటోళ్లు.. వీళ్లేం సినిమాలు తీస్తారన్న వాళ్ల నోళ్లు మూయించిళ్లు. రెండున్నర గంటలు అసలైన పళ్లెటూర్ పోరగాళ్లంటే ఎట్లుంటరో చూపించిళ్లు. ఊర్ల బలాదూర్ తిరిగే పోరగాళ్లు.. తలచుకుంటే ఏం చేయగలరో చూపించిళ్లు. ఊర్లళ్ల గొడవలు.. రాజకీయాలు ఎట్లుంటవో కళ్లకు కట్టినట్లు చూపించిళ్లు. మొత్తానికి మేం ఫేమస్ అనిపించుకున్నర్.
అదే నబ్బా ఫేమస్ యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ తీశిన మేమ్ ఫేమస్ సినిమా గురించి చెబుతున్నా. వారం రోజుల తర్వాత వీకాఫ్ దొరికింది. ఎటన్నా పోదాం అంటే దోస్తులంతా కొలువులకు పాయే. హాస్టల్లో బోర్ కొడుతుంటే బుక్ మై షో ఓపెన్ చేశిన. మేం ఫేమస్ సినిమా కనిపించింది. అరే గీ హీరోను ఎక్కడో చూశినా అనుకున్న.. అంతలోనే గుర్తొచ్చిండు.. యూ ట్యాబర్ సుమంత్ ప్రభాస్ గదా అని. అప్పట్లో దీప్తి సునైనాతో ఓ పాట తీసి మస్తు ఫేమస్ అయిండు. ఇగ గీ పోరడు హీరో అయిండా అని దానిపై క్లిక్ చేసిన.. అప్పడు తెల్సింది.. ఒక్క హీరోనే కాదు.. డైరెక్టర్ కూడా ఆయిననే అని. యూట్యూబ్‌లో మస్తు వీడియోలు చేస్తడు.. ఇగ సినిమా ఎట్లుంటదో చూద్దామని బుక్ చేశిన. పది నిమిషాలల్ల థియేటర్ ముందు వాలిపోయిన…
బండనర్సంపల్లి అనే ఊర్ల స్టార్ట్ అయితది అసలు కథ. ముగ్గురు పోరగాళ్లు ఉంటరు.. పనీ పాట ఏం ఉండదు వాళ్లకి.. ఎప్పుడు చూశినా తాగుడు.. మందితోని గొడవలు పడుడు.. డొక్కు బండి ఏస్కొని ఊరంతా బలాదూర్ తిరుగుడు. ఊర్ల ఒక్కడు కూడా వాళ్లని అరే పాపం పోరగాళ్లు మంచోళ్లుర అన్న పాపాన పోలే. కనపడ్డోని దగ్గర అప్పు తీసుకునుడు.. కనిపించిన కోళ్లని కోసుకొని తినుడు ఇదే పని. వీళ్లకు తోడు ఏ తప్పు చేసినా ఎనుకేసుకొచ్చే ఓ మామ.. అడ్డల బుడ్డలెక్క ఓ పోరడు. వాడి పేరు ఏం అనుకున్నరు.. లిప్‌స్టిక్ స్పాయిలర్. ఇక ఈ గ్యాంగ్‌కి ఊర్ల అందరి చేత తూ అని పించుకున్నాక కొంచెం బుద్ది ఒస్తది. అప్పుడు ఓ బిజినెస్ పెడుతరు. ఆ బిజినెస్ ఏంది? పెట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డారు?.. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది?.. అదైనా సక్సెస్ అయిందా? లేదా?.. ప్రేమించిన అమ్మాయి కోసం ఎట్ల పోరాడిళ్లు?.. బతుకు దెరువు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డరు?.. ఊరును డెవలప్ చేయడం కోసం ఎంత కష్టపడ్డరు?.. చివరికి ఎట్ల ఫేమస్ అయిళ్లు అనేది కథ.
సినిమా మొత్తం తెలంగాణ బాషల మస్తు రియలిస్టిక్గ ఉంటది. ఊరు ఇడిషి పెట్టి పట్నం ఒచ్చిన ప్రతీ ఒక్క పోరడు మస్తు కనెక్ట్ అవుతడు. మనల్ని మనం తెరపై చూసుకున్నట్లుంటది. డైలాగ్స్ కూడా ఊర్ల మనం మాట్లాడుకున్నట్లే ఉంటాయ్. గోరేటి వెంకన్న పాట సినిమాకే హైలెట్. మెసేజ్, కామెడీ, ఎమోషనల్ ఏ ఒక్కటి కూడా మిస్ కాలే. కానీ కొన్ని కొన్ని చోట్ల రొటీన్ సీన్లు బోర్ కొట్టించాయ్. సినిమా మొత్తం కొత్తవాళ్లే అయినా దుమ్ము దులిపేషిళ్లు. మొదటిసారే అయినా హీరోగా, డైరెక్టర్‌గా సుమంత్ ప్రభాస్ అదరగొట్టిండు. ఇక సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. సినిమా చూస్తున్నంత సేపు పచ్చటి పల్లెటూర్ల ఉన్నట్లే అనిపిస్తది. మొత్తానికి ఈ సినిమాతోటి యూత్‌ని ఎంకరేజ్ చేస్తే ఏం చేయగలరో అనే సందేశాన్ని ఇచ్చిండు హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్.