Bhola Shankar: వీరయ్య ముగిసింది.. భోళా శంకర్ మొదలయ్యింది
Megastar Chiranjeevi On The Sets Of Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఒక సినిమా పూర్తి అయ్యిందో లేదో.. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మరో సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. గత వారమే చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇంకా థియేటర్ బయటకు కూడా వెళ్ళలేదు. అప్పుడే చిరు మరో కొత్త చిత్రాన్ని ముగించడానికి బయల్దేరాడు. ప్రస్తుతం చిరు నటిస్తున్న చిత్రాల్లో భోళా శంకర్ ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు అధికారిక రీమేక్.
ఇక ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ ను జరుపుకొంది. ఇక తాజగా నేటి నుంచి కొత్త షెడ్యూల్ ను చిరు మొదలుపెట్టేశాడు. షూటింగ్ కోసం వేసిన కలకత్తా సెట్ లో దర్శకుడు, నిర్మాత కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ చిరు సెట్ లో అడుగుపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.