Chiru Leaks:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇటీవల చిరు లీక్స్ పేరుతో తను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు ఆసక్తికరమైన విషయాల్ని లీక్ చేస్తూ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నారు.
Chiru Leaks:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇటీవల చిరు లీక్స్ పేరుతో తను నటిస్తున్న
సినిమాలకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు ఆసక్తికరమైన విషయాల్ని లీక్ చేస్తూ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి మెగాస్టార్ `చిరు లీక్స్` పేరుతో మరో లీక్ ఇచ్చేశారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ `భోళా శంకర్`. తమిళ బ్లాక్ బస్టర్ `వేదాలం` ఆధారంగా ఈ సినిమాని తెలుగులో చిరుతో రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Chiru Leaks
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరుకు సోదరిగా క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించనుంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర అనిల్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. ఇటీవలే కోల్ కతా షెడ్యూల్‌ని పూర్తి చేసిన చిత్ర బృందం తాజాగా పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, తమన్నాలపై ఓ ప్రత్యేక గీతాన్ని షూట్ చేశారు.
Chiru Leaks 1
ఇదే విషయాన్ని మెగాస్టార్ తాజాగా ట్విట్టర్ వేదికగా లీక్ చేశారు. అంతే కాకుండా ఆన్ లొకేషన్ ఫొటోలని కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు. చిరు లీక్స్ పేరుతో `స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం!.. అప్పటి వరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్` అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు.
Chiru Leaks 1
చిరు లీక్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య తన సినిమాలకు సంబంధించిన విషయాల్ని సీక్రెట్‌గా ఉంచడం లేదు అనడం కంటే ఏదీ దాచుకోవడం లేదని చెప్పాలి. ఆ మధ్య ఓ చిన్న సినిమా ఫంక్షన్‌కు ఛీఫ్ గెస్ట్‌గా వెళ్లిన చిరు మాటల సందర్భంలో `ఆచార్య` టైటిల్‌ని లీక్ చేసి నాలుక కరుచుకున్నారు. ఇదే తరహాలో `గాడ్ ఫాదర్` మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్లని కూడా బయటపెట్టి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేశారు.
తనకు తెలియకుండానే తన సినిమాల అప్ డేట్స్‌ని చెప్పేస్తున్న చిరు ఇక లాభం లేదనుకుని `చిరు లీక్స్` అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనే స్వయంగా లీక్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా `భోళా శంకర్` సినిమాకు సంబంధించిన సాంగ్ షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరిగింది. ఈ విషయాన్ని చిరు లీక్స్ పేరుతో తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న `భోళా శంకర్` మూవీని ఆగస్టలు 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా చిరు `వాల్తేరు` వీరయ్య` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన విషయం తెలిసిందే.
స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది!
ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం !
అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023