Chiranjeevi: కూతురుకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన చిరు
Megastar Chiranjeevi Gifted A Costly Gift To His Daughter Sushmitha: మెగాస్టార్ చిరంజీవికి కూతుర్లు అంటే ప్రాణం అన్న విషయం తెల్సిందే. వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా.. అటు ఫ్యామీలికి కూడా సమయాన్ని కేటాయిస్తారు. తాజాగా చిరు, తన పెద్ద కూతురు సుస్మితకు కాస్ట్లీ గిఫ్ట్ ను అందించాడు. మహిళా దినోత్సవం సందర్భంగా సుస్మితకు ఒక అందమైన దుర్గాదేవి విగ్రహాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సుష్మిత మురిసిపోతూ ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు తన తండ్రి థ్యాంక్స్ చెబుతూ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక చిరంజీవి గిఫ్ట్ గా ఇచ్చిన ప్రతిమను, ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది సుస్మిత. “మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బహుమతి అందించడం చాలా ఆనందంగా ఉంది నాన్న. స్త్రీలను శక్తివంతులుగా దుర్గాదేవి కంటే గొప్పగా దేనితే వర్ణించగలం. ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది.ఇక సుస్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది.