Waltair Veerayya: తండ్రి సినిమాను అభిమానులతో కలిసి చూసిన మెగా డాటర్స్
Mega Daughters Watched Father’s Film with Fans: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అంటూ మెగా అభిమానులు ఓ పాటేసుకుంటున్నారు. అవును మరి.. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్, ఊర మాస్ స్టైల్ ను మెగా అభిమానులు మిస్ అవుతున్నారు. ఇక వాల్తేరు వీరయ్యతో ఆ లోటు తీరిపోవడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మెగా అభిమాని బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు అభిమానుల ముందుకు వచ్చి రచ్చ చేయడం మొదలుపెట్టింది. బాబీ చెప్పినట్లుగానే అభిమానులకు పూనకాలు తెప్పించేశాడు. మొదటి షోతోనే సినిమా మంచి హిట్ టాక్ ను అందుకున్నదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ పూనకాలు మొదలెట్టేశారు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, చిరు కటౌట్స్, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ర్యాలీలు.. ఒక్కటని లేదు.. చిరుపై అభిమానాన్ని ఏ రేంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో చూపిస్తున్నారు.
ఇక అభిమానులే కాదు చిరు డాటర్స్ కూడా తన తండ్రిపై వారి అభిమానాన్ని చాటుకున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాను అభిమానుల మధ్య కూర్చొని చూశారు.సంధ్య థియేటర్ లో చిరు కుమార్తెలు సందడి చేశారు. సుస్మిత, శ్రీజ, చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో పాటు మెగా కుటుంబం మొత్తం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో వాల్తేరు వీరయ్య సినిమాను అభిమానులతో కలిసి వీక్షించారు. సినిమా చాలా బావుందని, అభిమానులు ఇలానే రరెస్పాండ్ అవుతారని తాము ముందుగానే ఊహించినట్లు మెగా డాటర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలు చిరు వింటేజ్ లుక్ కు క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది చిరు పెద్ద కూతురు సుస్మితనే. ఆ వింటేజ్ లుక్ కోసం ఆమె చాలా కష్టపడిందట. ఇప్పుడు ఆ లుక్ ను అభిమానులు మెచ్చుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.