Tollywood Star Heros: అక్కినేని- మెగా ఫ్యామిలీ కలిసిన వేళ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
Mega and Akkineni Family In Single Frame: టాలీవుడ్ లో దిగ్గజ ఫ్యామిలీలు అంటే మెగా, అక్కినేని, నందమూరి, దగ్గుబాటి.. ఇక ఈ నాలుగు ఫ్యామిలీలలో ఏ రెండు ఫ్యామిలీలు కలిసినా ఫ్యాన్స్ కు పండగే.. ఇటీవలే సల్మాన్ ప్రైవేట్ పార్టీలో చిరు, వెంకటేష్ ఒక్కటిగా కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఒకే ఫ్రేమ్ లో కనిపించింది. ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ కూతురు వివాహ వేడుకలో సినీ తారలు సందడి చేశారు.
గురువారం రాత్రి హైదబాద్‌లో సునీల్ నారంగ్ కుమార్తె జాన్వి, ఆదిత్యతో ఏడు అడుగులు నడిచింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేయగా.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు, అక్కినేని తండ్రికొడుకులు నాగార్జున, నాగచైతన్య ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ఒకే ఫ్రేమ్ లో ఈ రెండు కుటుంబాలు కనిపించి, కనువిందు చేశాయి.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వీరితో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.