Sir Movie: మాస్టారూ.. మాస్టారూ.. వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
Masteru Master Video Song Out From Sir movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సార్. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మాస్టారు.. మాస్టారు.. నా మనసును గెలిచారు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ఈ సాంగ్ పై రీల్స్ చేసి ఫేమస్ అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సాంగ్ ను శ్వేతా మోహన్ ఆలపించింది. లిరికల్ సాంగ్ కే అభిమానులు పిచ్చెక్కిపోయారు.
తాజాగా మాస్టర్ మాస్టారు వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సంయుక్త- ధనుష్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎంతో ఫ్రెష్ గా కనిపించడం తో ఈ వీడియోను అభిమానులు ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటిటీలో స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో మార్చి 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ లో రచ్చ చేసిన సార్.. ఓటిటీలో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.