Roja vs rajini fans:ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పోరంకిలో జరిగిన వేడుకల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు.
Roja vs rajini fans:ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పోరంకిలో జరిగిన వేడుకల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్పై తనకున్న ప్రేమని వ్యక్తం చేశారు. అంతే కాకుండా చంద్రబాబు మంచి విజనరీ అని, ఆయన వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇదే క్రమంలో ఏపీని కూడా అభివృద్ది చేయాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఇటీవల విమర్శలు చేయడం తెలిసిందే. నటి, మంత్రి రోజా కూడా తలైవాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రజినీకాంత్ హీరో కాదు జీరో అని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రజినీ అభిమానులు ఈ వ్యాఖ్యలని సీరియస్గా తీసుకున్నారు. సినీ ఫిల్డు నుంచి వచ్చిన రోజా కూడా అనుచితంగా మాట్లాడటం ఏమీ బాగాలేదని, గతంలో రజినీకాంత్ కాళ్లు మొక్కినప్పుడు ఆయన వ్యక్తిత్వం గుర్తుకురాలేదా? అంటే ఫ్యాన్స్ రోజాపై మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో రోజా వర్సెస్ రజినీ ఫ్యాన్స్ వార్ వైరల్గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా రోజా తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి ప్రత్యేకంగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ రోజా చెప్పిన సమాధానం మరింత వివాదంగా మారింది. ఆంధ్రలో రానున్న ఎపన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని తెలిపారు. ఇది రజనీ అభిమానుల్ని మరింత ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది.
వ్యగ్యంగా రజినీని కించ పరుస్తూ రోజా మాట్లాడిందని ఆమెపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడిని ఇలా అవమానిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియమా వేదికగా రోజాపై కామెంట్లు చేస్తూ సూపర్ స్టార్ అభిమానులు పోస్ట్లు పెడుతుండటంతో రోజాకు రజినీ ఫ్యాన్స్ మధ్య వివాదం మరింతగా ముదురుతోంది.