Manchu vishnu- Prakash Raj: ‘మా’ ప్రత్యర్థులు ఇద్దరు ఒక్కటిగా కలిసిన వేళా
Manchu Vishnu And Prakash Raj In Single Frame: సాధారణంగా చిత్ర పరిశ్రమలో గొడవలు ఎన్ని ఉన్నా అది ఆ నిమిషం వరకే.. ఆ తరువాత వారే కలిసిపోయి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. గొడవలు ఉన్నాయి కదా అని మీడియా ముందు ఎడ ముఖం, పెడ ముఖం పెట్టుకొని కనిపించరు. అవన్నీ ఎలా ఉన్నా ఎదుటి వారు పలకరిస్తే పలకరించాలి అనేది సంస్కారవంతులు చేసే పని.. ప్రస్తుతం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు హీరో మంచు విష్ణు అంతే సంస్కారం చూపించారు. వీరిద్దరూ ఈ ఏడాదిమా ఎలక్షన్స్ లో పోటీ చేసిన విషయం తెల్సిందే.
తమ ప్యానెల్ సభ్యులతో కలిసి ఒకరిపై మరొకరు మాటల తూటాలను పేల్చుకున్నారు. ఎలక్షన్స్ జరిగే వరకు కూడా ఇద్దరు సోషల్ మీడియా ద్వారా మాటల యుద్ధం జరిపారు. ఇక చివరికి మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలవగా ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఆ ఎన్నికల తరువాత వీరిద్దరూ సింగిల్ ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఈ అద్భుత ఘట్టానికి వేదికగా మారింది విశ్వక్ సేన్ మూవీ పూజా కార్యక్రమం. ఈ ఈవెంట్ కు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అతిధులు హాజరయ్యారు ఎన్నికలప్పుడు జరిగిన విషయాలను పట్టించుకోకుండా ఒకరినొకరు పలకరించుకొని కొద్దిసేపు ముచ్చటించారు. ఇక వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.