Manchu Manoj: ఓ బ్రదరూ.. త్వరగా ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు
Manchu Manoj Tweet Viral In Social Media: టాలీవుడ్ హీరోల్లో మంచు మనోజ్ ఒకడు. ప్రస్తుతం కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్.. ఈ ఏడాది నుంచి బిజీగా మారాలని చూస్తున్నాడు. ఇక మనోజ్ రెండో పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మనోజ్, భూమా మౌనిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే వారు సహజీవనం చేస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్, మౌనిక కూడా జంటగా కెమెరా కంటికి కనిపిస్తున్నారు. అయితే తన జీవితంలో ఏదైనా జరిగితే అది అభిమానులకు తప్పకుండ తెలియజేస్తానని అప్పటివరకు ఆగమని మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయం వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నో రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తున్న ఓ స్పెషల్ న్యూస్ ను 20వ తేదీన అందరితో పంచుకుంటానంటూ మంచు మనోజ్ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. దీంతో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేదానికోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పెళ్లి విషయమా..? లేక సినిమా విషయామా ..? అనేది తెలియక ఫ్యాన్స్ త్వరగా చెప్పమని కామెంట్స్ పెడుతున్నారు. మరి మనోజ్ చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.