Manchu Manoj: మౌనిక మెడలో తాళికట్టిన మనోజ్.. ఫోటోలు వైరల్
Manchu Manoj Tie Knot Bhuma Mounika: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డి మెడలో మనోజ్ తాళి కట్టేశాడు. కొద్దిసేపటి క్రితమే ఈ వివాహం మనోజ్ అక్క మంచు లక్ష్మీ ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాల కారణంగా వీరు 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొద్దిరోజులకే మనోజ్, భూమా మౌనిక రెడ్డి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. 2016లో మౌనికా రెడ్డికి వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో వివాహం అయ్యింది. 2018లో మౌనికారెడ్డి-గణేష్ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత రెండేండ్లకు మౌనికా రెడ్డి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఈ జంట నేడు ఒక్కటి అయ్యారు. దీంతో అభిమానులు, ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.