Manchu Manoj: ఏంది అన్నా నువ్వు.. ఏదో చెప్తావనుకొంటే.. ఇంకేదో చెప్పావ్
Manchu Manoj New Movie Announcement: గత కొన్నిరోజుల గా మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికాతో మనోజ్ సహా జీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక రెండు రోజుల క్రితం ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని మనోజ్ అనడంతో అభిమానులందరూ రెండో పెళ్లి గురించి చెప్తాడేమో అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తారుమారుచేస్తూ తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ను ఇచ్చాడు. అటెన్షన్ ఆల్ మూవీ లవర్స్.. ! మీరు హార్ట్-పంపింగ్, యాక్షన్-ప్యాక్డ్ , సైడ్-స్ప్లిటింగ్లీ హిలేరియస్ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా? సరే, మీ సీట్లలో వుండండి. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు మీకు ఓ ప్రత్యేక వార్త అందిస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ అనే కొత్త మూవీతో మీ ముందుకు రాబోతున్నాను అని చెప్పుకొచ్చాడు. దాదాపు ఆరేళ్ళ తరువాత మనోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
‘వాట్ ది ఫిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్ లైన్.అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రపంచ స్థాయి వైబ్ లను కలిగిస్తుంది. పోస్టర్ చిత్రానికి సంబధించిన ముఖ్య అంశాల అంతర్గత వివరాలను వెల్లడిస్తుంది. ఈ ఆసక్తికరమైన పోస్టర్ లో చాలా మంది తెలియని వ్యక్తులను ఎదుర్కోవటానికి మనోజ్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గోగల్ మాస్క్ తో ఉన్న అమ్మాయి క్యారియేచర్ చిత్రాన్ని కూడా చూపిస్తుంది. బ్యాక్ పోజ్‌లో మనోజ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. మనోజ్ మేక్ ఓవర్ అయ్యారు. అతని కొత్త గెటప్‌ను చూడటానికి మరికొంత సమయం వేచి చూడాలి. ఇక దీంతో ఏంది అన్నా నువ్వు.. ఏదో చెప్తావనుకొంటే.. ఇంకేదో చెప్పావ్ అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.