Manchu Manoj: మంచు వారబ్బాయి పెళ్లి డేట్ ఫిక్స్..?
Manchu Manoj Marriage Date Fix: మంచు మోహన్ బాబు చిన్న కొడుకు, నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మనోజ్ హీరోగా తెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. మనోజ్ కొన్నేళ్లుగా దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికా రెడ్డితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ మనోజ్, మౌనికతో చెట్టాపట్టాలేసుకొని కెమెరా ముందు కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు రుజువైంది. ఇక వీరి పెళ్ళికి మోహన్ బాబు ఒప్పుకోలేదని, అందుకే మనోజ్ తండ్రిని వదిలేసి వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మనోజ్- మౌనిక పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతకుముందు వీరి పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా సమయం వచ్చినప్పుడు చెప్తా అనే మనోజ్.. ఈసారి మౌనిక గురించి మాట్లాడాడు. ఆమె తనకు మంచి స్నేహితురాలిని, తాను ఎన్నో సమస్యలతో పోరాడుతున్నప్పుడు ఆమె అండగా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు. మిగిలిన విషయాలు త్వరలోనే చెప్తానని చెప్పుకొచ్చాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 3 న వీరి పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసినట్లు తేలుతోంది. అతి దగ్గర బంధువుల మధ్య వీరి వివాహం గుడిలో జరగనుందట. వీరి పెళ్ళికి మోహన్ బాబు కుటుంబం వస్తారో రారో అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే. ఇక మనోజ్ మొదటి భార్య ప్రణీతకు మనోజ్ విడాకులు ఇచ్చేసిన విషయం తెల్సిందే..