Pratap Pothan: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు మృతి
Malayalam Actor Pratap Pothen Passes Away: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. అయితే ఆయనకు నిద్రలోనే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ప్రతాప్ మృతికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రతాప్ మృతితో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 70 సంవత్సరాల ప్రతాప్ ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.
సడెన్ గా ఆయన మృతి అందరిని కలిచివేస్తోంది. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ప్రతాప్ మలయాళ, తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడే.. ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఇక ప్రతాప్ చివరిగా మమ్ముట్టి నటించిన CBI 5 ది బ్రెయిన్ చిత్రంలో కనిపించారు. ఇక ప్రతాప్, నటి రాధికా మొదటి భర్త కావడం విశేషం. 1985లో రాధిక ను వివాహమాడిన ప్రతాప్ కొన్ని విబేధాల కారణంగా 1986లో రాధికకు విడాకులు ఇచ్చేసి అమలా సత్యనాథ్ ను వివాహమాడారు. అయితే ఈ బంధానికి కూడా 2012 లో స్వస్తి పలికి ప్రస్తుతం చెన్నైలో ఒంటరిగా నివసిస్తున్నారు.