Malvika Nair: నాగశౌర్యతో ముద్దు.. ఇబ్బంది లేదన్న హీరోయిన్
Malavika Nair Talking About Nagashourya: నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా మార్చి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాళవిక నాయర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
నాగశౌర్య, మాళవిక నాయర్ కు ఇది రెండో సినిమా.. ఈ జంట మొదట కల్యాణ వైభోగమే చిత్రంలో మెప్పించారు. దీంతో నాగశౌర్యతో తనకు మంచి అనుబంధం ఉందని మాళవిక చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ సినిమాలో అమ్మడు.. హీరోకు ఘాటు పెదవి ముద్దు అందించింది. ఈ విషయం గురించి కూడా ఆమె చెప్పుకొచ్చింది. “అది నాకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సన్నివేశం కాదు. కథలో భాగమైన, కథకి అవసరమైన సన్నివేశం కాబట్టి దర్శకుడు ఎంతో నెమ్మదిగా నాకు వివరించాడు. శ్రీనివాస్ గురించి, శౌర్య గురించి నాలు తెలుసు కాబట్టి నేను ఓకే అన్నాను” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సిసినిమాతో ఈ జంట ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.