Mahesh Babu:టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యధికంగా వెకేషన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ (Superstar Mahesh).
Mahesh Babu:టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యధికంగా వెకేషన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ (Superstar Mahesh). సినిమాల్లో నటిస్తూనే బ్రేక్ తీసుకుంటూ ప్రత్యేకంగా ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరిస్తుంటారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
కీలక షెడ్యూల్‌ని ఇటీవలే పూర్తి చేసిన మహేష్ షూటింగ్ కు బ్రేకిచ్చారు. ఫ్యామిలీలో కలిసి వెకేషన్ కోసం ఇటలీ వెళ్లారు. తిరగొచ్చాక వ్యక్తిగత వ్యవహరాల కారణంగా మళ్లీ దుబాయ్‌కి ప్రత్యేకంగా పయనమయ్యారు. హైదబాద్ తిరిగొచ్చిన మహేష్ తిరిగి SSMB28 తాజా షెడ్యూల్‌ని ప్రారంభిస్తారని అంతా ఊహించారు. అయితే ఎండలు మండిపోతుండటంతో షూటింగ్ చేయడానికి ఇష్టపడని మహేష్ ఫ్యామిలీతో కలిసి ఈ సారి స్పెయిన్‌కు వెళ్లారు.
అయితే అక్కడ వెల్ నెస్ సెంటర్లో ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకున్నారట. స్ట్రెస్‌ని తగ్గించుకుని మళ్లీ రీఛార్జ్ అయ్యారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా తెలిపారు. సూపర్ కూల్‌గా ఉన్న ఓ ఫోటోని షేర్ చేసిన మహేష్ `పాజ్ అండ్ రీసెట్` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతే కాకుండా సదరు ఫొటోకు #travel #timeout అనే హ్యాష్ ట్యాగ్‌లను కూడా జోడించడంతో మహేష్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే బుధవారం మహేష్ స్పెయిన్ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చేశారు.
శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో బ్లూ కలర్ క్యాప్, బ్లాక్ సన్ గ్లాసెస్.. యాష్ కలర్ టీషర్ట్..బ్రౌన్ కలర్ జాకెట్ ధరించి మాసిన గడ్డం.. పెరిగిన జుట్టుతో మహేష్ 2007 నాటి తన లుక్‌ని గుర్తు చేశారు. ప్రస్తుతం మహేష్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ నటిస్తున్న SSMB28 తాజా షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్‌లో ప్రారంభం కానుంది. ఇందు కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB28 టైటిల్ ని ప్రకటించనున్నారు. కృష్ణ నటించిన `ఊరికిచ్చిన మాట` టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
1684302131 Mahesh Babu Clicked At Airport From Spain Vacation
1684302140 Mahesh Babu Clicked At Airport From Spain Vacation Jpeg1
1684302149 Mahesh Babu Clicked At Airport From Spain Vacation Jpeg2