Mahesh Babu: ఇలా అయితే బాబు ఎప్పటికీ ముసలోడు అవ్వడు
Mahesh Babu Gym Look Viral In Social Media: సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు 47. ఆయనకు ఇద్దరు పిల్లలు. సాధారణంగా ఆ వయస్సులో ఉన్నవారు ఎలా అంటారు. కొంచెం పొట్ట.. కొంచెం బట్టతలతో కనిపిస్తారు. కానీ, మహేష్ ను చూస్తే పాతికేళ్ల కుర్రాడికన్నా తక్కువే కనిపిస్తున్నాడు.ఇలా కనిపించడానికి మహేష్ చేసే సాధన ఏదైతే ఉందో దాన్ని చేయడం ఎవరి వలన కాదు. ఒక్కో సినిమాకు ఒక్కో హెయిర్ స్టైల్, ఒక్కో బాడీ మార్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb 28 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఎంతో కష్టపడుతున్నాడు. కొత్త లుక్ కోసం ఎన్నోరోజులుగా మహేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజగా ఆ లుక్ వచ్చినట్లు కనిపించేస్తోంది.
తాజాగా మహేష్.. తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు. జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఆర్మ్స్ డే అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పర్ఫెక్ట్ బాడీ.. చెదిరిన జుట్టు.. చెమటపట్టిన శరీరం.. ముఖ్యంగా ఆ నరాలు బయటికి కనిపించి మ్యాన్లీ లుక్ లో మెస్మరైజ్ చేసాడు. ఈ ఫోటో చూసిన వారెవరు మహేష్ బాబు కు 47 అంటే అస్సలు నమ్మరు. ఇక ఈ ఫోటోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అయితే నువ్వెప్పటికీ ముసలోడివి కాలేవు బ్రో అని కొందరు.. ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా అన్న అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.