Oscar 2023: ఆస్కార్ అందుకున్న సినిమాలు.. ఏఏ ఓటిటీలో ఉన్నాయంటే..?
List Of Oscar Winning Movies Available On OTT Platform: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఆస్కార్ అవార్డులను నేటి ఉదయం ప్రకటించిన విషయం తెల్సిందే. అనుకున్నట్లుగానే ఇండియా గర్వించదగ్గ అవార్డును ఆర్ఆర్ఆర్ ఇండియాకు పట్టుకొచ్చేసింది. ఇక ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు ఆస్కార్ వేదికపై రచ్చ రచ్చ చేశాయి. అవేంటంటే..ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది ఎలిఫెంట్ విస్పరర్స్, బ్లాక్పాంథర్ -వకండా ఫరెవర్, టాప్ గన్ మావెరిక్. ఇక ఆస్కార్ అవార్డులు అందుకోవడంతో ఈ సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటి అని అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాలు ఏఏ ఓటిటీలో ఉన్నాయో అని వెతకడం మొదలుపెట్టారు.
ఇక ఈ సినిమాలు ఏఏ ఓటిటీలో ఉన్నాయో అనేది మేము మీకు చెప్పేస్తున్నాం. ఈ ఏడాది ఆస్కార్ గెలిచిన సినిమాల్లో ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ చిత్రాలు ఇండియాలో స్ట్రీమింగ్ లేవు. కాబట్టి వాటికోసం వెతికి టైమ్ వేస్ట్ చేసుకోకండి. ఇక ఆస్కార్ అవార్డులను ఎక్కువగా కైవసం చేసుకున్న ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా సోనీలీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దాని తరువాత ఎక్కువ అవార్డులను అందుకున్న ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దీనితో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్, పినాషియో చిత్రాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక బ్లాక్పాంథర్ -వకండా ఫరెవర్ హాట్ స్టార్ లో ఉండగా.. ఆర్ఆర్ఆర్ జీ5 లో కనువిందు చేస్తుంది. అవతార్ 2, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్ అందుకున్న ఈ సినిమాలను ఇంటివద్ద కుటుంబంతో కలిసి చూసి ఆనందించండి.