Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవదాసు సినిమాతో పరిచయం అయిన ఈ భామ..టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమ్మడు ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్ళింది.
Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవదాసు సినిమాతో పరిచయం అయిన ఈ భామ..టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమ్మడు ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఆ ప్రేమ బ్రేకప్ కు దారితీయడంతో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లి బరువు పెరిగింది. ఇక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూనే అవకాశాల కోసం బాలీవుడ్ వైపు వెళ్ళింది. ఇక అక్కడ కొన్ని సినిమాలు చేసి, మంచి గుర్తింపునే అందుకున్న ఇల్లూ బేబీ.. కత్రీనా సోదరుడుతో ప్రేమాయణం నడిపి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఇది నిజమో, కాదో అనేది తెలుసుకొనేలోపు
పెళ్ళికి ముందే ప్రెగెన్సీ వార్త చెప్పి షాక్ ఇచ్చింది. అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది మాత్రం చెప్పనేలేదు.
ఇక నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమాలతో తన బిడ్డ గురించి చెప్పుకొస్తుంది. కాగా, తాజాగా ఈ చిన్నది మరోసారి తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఏంజెల్స్ అని క్యాప్షన్ పెట్టుకొచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అద్దం ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన ప్రతిసారి అభిమానులు.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతూనే తండ్రి ఎవరో కూడా చెప్పొచ్చుగా అని అడిగేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా.. ప్రెగ్నెన్సీ వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బిడ్డ పుట్టాకా కానీ, అమ్మడు మరోసారి వెండితెర మీద కనిపించదు అనే చెప్పాలి. మరి ముందు ముందు ఇలియానా ఎలా కనిపిస్తుందో చూడాలి.