శాకుంతలం సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తుంది.
శాకుంతలం సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా హాలీవుడ్ సిటాడెల్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. హాలీవుడ్ లో బాగా హిట్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక నటించిన పాత్రలో సమంత నటిస్తోంది. ప్రియాంక చోప్రా సిటాడెల్ లో చాలా బోల్డ్ సీన్స్ లో నటించిన విషయం తెల్సిందే. ఇక ఆ సీన్స్ చూసాకా సామ్ కూడా అలాంటి సీన్స్ లో నటిస్తుందని పుకార్లు వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ చాలా ఉన్నాయని వరుణ్ కి ఆమె లిప్ లాక్ కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమంత చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి.
ఇక ఈ రూమర్లకు చెక్ పెట్టారు సమంత పీఆర్ టీమ్. ఆ వార్తలో నిజం లేదని చెప్పుకొచ్చారు. సామ్.. ఎలాంటి బోల్డ్ సీన్ చేయడం లేదని, వరుణ్ తో లిప్ లాక్ కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం విన్న దగ్గర నుంచి చాలా మంది సమంత ఫ్యాన్స్ హమ్మయ్యా అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ లో సామ్ చేసిన బోల్డ్ సీన్స్ కే ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటి సీన్స్ చేస్తే మరింత ట్రోలింగ్ పెరిగే అవకాశం ఉండడంతో సామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.