Dasara: దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్.. నానికి సపోర్ట్ ఇచ్చే హీరో ఎవరు..?
Latest Update About Dasara Pre Release Event: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. చెన్నై, బెంగుళూరు, వైజాగ్ అంటూ నాని తిరిగేస్తూ సినిమా గురించి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా యు/ఏ సెన్సార్ రిపోర్ట్ ను కూడా అందుకోవడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా నాని డీ గ్లామరైజ్డ్ లుక్ తో అందరిని షాక్ కు గురి చేశాడు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకుంటున్నారట. ఈ నెల 25 నుంచి 27 డేట్స్ లో ఏదొక డేట్ కి ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ ఈవెంట్ కు నాని ఏ హీరోను గెస్ట్ గా పిలుస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే నాని క్రేజ్ కు మరో హీరో సపోర్ట్ అవసరం లేదు. కాకపోతే నాని అంతకుముందు సినిమాలు ప్లాప్ అందుకోవడంతో కొద్దిగా నానికి కూడా బూస్టప్ కావాల్సిన పరిస్థితి. మరి ఈ విషయాన్ని అర్ధం చేసుకొని నాని వేరే హీరో హెల్ప్ తీసుకుంటాడా..? లేక ఒక్కడే పోరాటం సాగిస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.