Varasudu: వారసుడు వాయిదా.. అంత సీన్ లేదట
Latest News About Varasudu Release: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొదటి నుంచి ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. దానికోసం ఎంతో పోరాడాడు. చివరికి అనుకున్నట్లే ఎక్కువ థియేటర్లను అందుకొని జనవరి 11 న సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. అయితే రిలీజ్ కు రెడీ అవుతున్న సమయంలో ఈ సినిమా వాయిదా అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
తెలుగు వెర్షన్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని.. ఇది రెండు మూడు రోజులు ఆలస్యంగా రిలీజవుతుందని గుసగుసలు మొదలయ్యాయి. అయితే దిల్ రాజు మాత్రం అంత సీన్ లేదు.. అన్ని సినిమాలతో పాటు తమ సినిమా కూడా వస్తున్నట్లు చెప్పుకొచ్చేశాడు. తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుందట. నెల ముందరే థియేటర్ల మీద కర్చీఫ్ వేసి పెట్టి విడుదలకు అంతా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ‘వారసుడు’ థియేటర్లను వేరే చిత్రాలకు వాటిని ఇచ్చే అవకాశమే లేదన్నది దిల్ రాజు మాట. ఏదిఏమైనా.. ఎవరు ఎన్ని అనుకున్నా వారసుడు మాత్రం అనుకున్న టైమ్ కు అనుకున్న విధంగా ప్రేక్షకుల ముందుకు రానున్నదట. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.