NayanThara: మెగాస్టార్ తో లేడీ సూపర్ స్టార్ పోటీ..?
Latest News About NayanThara And Chiru: మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తునం చిత్రం గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో చిరు కు చెల్లిగా నయన్ కనిపించనుంది.
ఇక నయనతార, చిరు కి మధ్య వచ్చే సీన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటాయని.. ఈ సీన్స్ లో నయనతార,చిరు పోటీ పడి నటించారట. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలుపుతోంది. దీంతో ఈ కాంబో కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. సైరా నరసింహ రెడ్డి చిత్రంలో నయన్, చిరు సరసం నటించిన విషయం తెల్సిందే.. ఇప్పుడు ఈ సినిమాలో చిరు కు చెల్లిగా నటిస్తోంది. అందులో కూడా నయన్, చిరు ను డామినేట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ నిడివి తక్కువ ఉండడం వలన ఆమె పాత్ర కనిపించలేదు.
ఇందులో అన్నాచెల్లెలి గా చిరు, నయన్ మధ్య సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని, ఆ సన్నివేశాల్లో నయన్, చిరు నువ్వా నేనా అన్నట్లు నటించినట్లు చెప్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, మరి ఈ సినిమాతో చిరు హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.