Latest News About Nandamuri Balakrsina New Movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి షూటింగ్ జరుపుకొంటుంది.
Latest News About Nandamuri Balakrsina New Movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తో బాలయ్య ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సెట్స్ మీద ఉండగానే బాలయ్య మరో కుర్ర డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహాకు బాలయ్య ఛాన్స్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ఒక మంచి కథను బాలయ్యకు వినిపించగా ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ నిర్మించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలయ్యకు ఇంకో హిట్ పడే అవకాశం ఉందని అంటున్నారు నందమూరి అభిమానులు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.