సినిమాలకు కాజల్ గుడ్ బై చెప్పిందా..?
సినిమాలకు కాజల్ గుడ్ బై చెప్పనుందా..? అంటే నిజమనే మాటలు వినిపిస్తున్నాయి. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చందమామ స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం మాతృత్వపు ప్రేమను ఆస్వాదిస్తోంది.
ఇక దీని కారణంగానే కాజల్ సినిమాలకు దూరమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకు కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందట. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. నీల్ (కాజల్ కొడుకు పేరు) కు రెండేళ్లు వచ్చేవరకు కాజల్ సినిమాల వైపు రాదని టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం విన్న కాజల్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే.