Latest Buzz About Prabhas- Maruthi Film: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో పాటు మారుతీ సినిమాను కూడా సైలెంట్ గా పట్టాలెక్కించేశాడు.
Latest Buzz About Prabhas- Maruthi Film: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో పాటు మారుతీ సినిమాను కూడా సైలెంట్ గా పట్టాలెక్కించేశాడు. ఇక ఇపప్టికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రోజుకో వార్త బయటకు వస్తోంది. అందులో నిజం ఉందా..? లేదా..? అని పక్కన పెడితే ఆ వార్తలు మాత్రం సినిమాపై హైప్ ను పెంచేస్తున్నాయి.
గతంలో ఈ చిత్రంలో తాత పాత్రలో సత్యరాజ్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సత్యరాజ్ చేయాల్సిన ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు ఇంకా అంచనాలు పెట్టేసుకుంటున్నారు. మరి ఇదైనా నిజమా..? లేక ఇది కూడా పుకారేనా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.