Laila: శబ్దం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సీనియర్ బ్యూటీ
Laila Onboard For Sabdham Movie: సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ కోసం బాగానే కష్టపడుతోంది. ఇప్పటికే సర్దార్ సినిమాలో మంచి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఈ భామ మరో బంపర్ ఆఫర్ పట్టేసింది. ఆది పినిశెట్టి హీరోగా అరివగజగన్ వెంకటాచలం డైరెక్షన్ లో వస్తున్న సినిమా శబ్ధం. ఈ చిత్రంలో లైలా కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ఇక ఆది హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 7జి ఫిలిమ్స్ ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి నిర్మిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఆది- అరివగజగన్ కాంబోలో ఇప్పటికే వైశాలి సినిమా వచ్చింది. ఈ చిత్రం ఎంతటి విజయం అందుకుందో అందరికి తెల్సిందే. ఇక ఈ కాంబో 14 ఏళ్ళ తరువాత రీపీట్ అవుతుండడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆది పెళ్లి తరువాత హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో అందరూ ఈసినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో లైలా పాత్ర అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని ఈ మూవీ తర్వాత లైలా మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతారని అంటున్నారు. మరి ఈ కాంబో ఎలా ప్రేక్షకులను భయపెడుతుందో చూడాలి.