Custody: రేవతిగా బేబమ్మ.. కస్టడీతో హిట్ కొట్టేలా ఉందే
Krithi Shetty Look Out From Custody Movie: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన చైతూ లుక్ భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. మొట్ట మొదటిసారి చైతూ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ను మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. రేవతి అనే పాత్రలో బేబమ్మ కనిపిస్తోంది.
కటకటాల వెనుక చాలా టెన్షన్ పడుతూ కృతి లుక్ ఉంది. దీంతో ఈ కథపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఉప్పెన తరువాత చాలా ఇంటెన్సివ్ పాత్రలో కృతి కనిపిస్తోందని పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ఇక కృతికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ఉప్పెన తరువాత అంతటి విజయాన్ని అమ్మడు అందుకున్నది లేదు. మరోపక్క చైతూ, కృతికి ఇది రెండో సినిమా.. బంగార్రాజు లో ఈ జంట కనిపించి మెప్పించారు. దీంతో వీరిమధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా కృతి మంచి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.