‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమరం భీముడో వీడియో సాంగ్ రిలీజ్
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల చరిత్ర తిరగరాసింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటించగా, వీరి పాత్రలకి థియేటర్ల లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా థియేటర్లో దూసుకుపోతుంది.
ఇక మేకర్స్ ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన కొమరం భీముడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో అన్ని భాషల్లో ఈ పాటను విడుదల చేయగా, భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.