Vijay: విజయ్ విడాకులు.. కోలీవుడ్ లో కొత్త చర్చ
Kollywood Hero Vijay Divorce Rumors Viral In Social Media: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు కొన్ని రోజులుగా కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ తన భార్య సంగీత తో విడిపోవాలని నిశ్చయించుకున్నారని తొందరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియగానే విజయ్ అభిమానులు అందరూ అయోమయంలో పడ్డారు.వీరిపై విడాకుల వార్తలు రావడానికి ప్రధాన కారణం వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంగీత రాకపోవడమే. అంతేకాదు డైరెక్టర్ అట్లీ భార్య సీమంతం వేడుకల్లో కూడా విజయ్ భార్య సంగీత పాల్గొనలేదు.దీంతో వీరి మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త క్రియేట్ చేశారు.
ఇక ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సంగీత ఫంక్షన్స్ కి రాకపోవడానికి ప్రధాన కారణం ఆమె తన పిల్లలతో కలిసి యూఎస్ వెకేషన్ కి వెళ్ళిందట. అందువల్లే ఈ ఫంక్షన్ల లలో ఆమె పాల్గొనలేదట. కానీ వాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మరోపక్క అజిత్ అభిమానులే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని, వారసుడు సినిమా నెగెటివ్ టాక్ రావడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి విజయ్ ఏమైనా బయటికి వచ్చి ఇవన్నీ రూమర్స్ అని చెప్తే బావుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.