Kodali Nani : జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారు
Kodali Nani Sensational Comments On NTR: వైసీపీ నేత కొడాలి నాని, హీరో ఎన్టీఆర్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాని ఎప్పుడైతే వైసీపీ లో చేరాడో అప్పటి నుంచి వీరి స్నేహ బంధం తెగిపోయింది. ఇక పార్టీ తరుపున నాని, ఎన్టీఆర్ ను ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు.. అయితే ఏమైందో ఏమో కానీ మొట్టమొదటిసారి ఎన్టీఆర్ గురించి నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బలమైన కులం ఏపీని ఆక్రమిస్తోంది అని, పార్టీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ డీఎన్ ఏ ను పక్కన పెట్టి నారా లోకేష్ ని అందలం ఎక్కించడానికి బాబు చూస్తున్న తీరుని ఆయన పూర్తిగా తప్పుపట్టాడు.
ఒక ఎన్టీఆర్ ఒక వైఎస్సార్ కలిస్తే జగన్ అవుతారు అంటూ ఆయన బలం శక్తి ఏంటో నాని చెప్పుకొచ్చాడు. ఆనాడు టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీయార్ నుంచి ఈ రోజు జూనియార్ దాకా ఎవరినీ టీడీపీలో లేకుండా బాబు చేశాడని, జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్.. మధ్యలో లోకేష్ ను తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను లేకుండా చేసేసారు అని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడు లేనిది నాని ఇలా తారక్ గురించి మాట్లాడానికి కారణం ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.