Kiran Abbavaram: ఓ అన్నా.. కొంచెం గ్యాప్ ఇవ్వరాదే
Kiran Abbavaram New Film Pooja Ceremony: రాజావారు రాణివారు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో కిరణ్ కు మంచి అవకాశాలే తీసుకొచ్చి పెట్టాయి. ఎస్ఆర్ కల్యాణమండపం. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు భాగా కావాల్సినవాడిని లాంటి చిత్రాలతో వచ్చాడు కానీ ప్రేక్షకుల మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. ఇక ఈ ఏడాది వినరో భాగ్యం విష్ణు కథ అంటూ వచ్చి అభిమానులను మెప్పించాడు. దీంతో చాలా గ్యాప్ తరువాత కిరణ్ కు మంచి విజయం లభించింది. ఇక ఆ హిట్ తో కుర్ర హీరోలో జోష్ పెరిగింది. ఈ సినిమా ఇంకా థియేటర్ లో ఉండగానే మీటర్ అనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు లైన్లో పెట్టాడు. ఇంకా ఇది రిలీజ్ కాకుండానే తొమ్మిదో సినిమాని స్టార్ట్ చేయడం విశేషం.
విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. డైరెక్టర్ వివి వినాయక్ ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యి క్లాప్ కొట్టాడు. మంచి కమర్షియల్ సినిమా అని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. లోబడ్జెట్ తో తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథలని కిరణ్ అబ్బవరం ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నాడు కిరణ్. కథలు ఒకే.. కానీ కొంచెం చూసుకొని నెమ్మదిగా వెళ్తే బావుంటుందని అభిమానులు సలహాలు ఇస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో ఎలాంటి హిట్లు అందుకుంటాడో చూడాలి.