Unni Mukundhan: మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ముకుందన్ పై 2017లో ఒక అత్యాచారయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అవకాశం కావాలని వచ్చిన యువతిపై ఉన్ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని విచారణలో తేలింది. ఇక ఇదంతా అబద్దమని, ఆ యువతీ తనపై తప్పుడు కేసుపెట్టినట్లు ఉన్ని.. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. అంతేకాకుండా ఆమె తన దగ్గరనుంచి రూ. 25 లక్షలు కావాలని డిమాండ్ చేసిందని తెలిపాడు.
Unni Mukundhan: మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ముకుందన్ పై 2017లో ఒక అత్యాచారయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అవకాశం కావాలని వచ్చిన యువతిపై ఉన్ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని విచారణలో తేలింది. ఇక ఇదంతా అబద్దమని, ఆ యువతి తనపై తప్పుడు కేసుపెట్టినట్లు ఉన్ని.. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. అంతేకాకుండా ఆమె తన దగ్గరనుంచి రూ. 25 లక్షలు కావాలని డిమాండ్ చేసిందని తెలిపాడు. 2017 సెప్టెంబర్ లో ఈ కేసు ఫైల్ అయ్యింది. ఈ కేసులో ఉన్నిముకుందన్ దోషిగా క్రింది స్థాయి కోర్టు తేల్చడంతో అతను హైకోర్టుని ఆశ్రయించాడు. ఇక ఇక్కడ కూడా అతనికి చుక్కెదురు అయ్యింది. ఈ కేసలో తనని నిర్దోషిగా ప్రకటించాలంటూ హైకోర్టులో ఆయన వేసిన పిటీషన్ ని ధర్మాసనం తిరస్కరించింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి లో విధించిన స్టేని కూడా ఎత్తివేసింది. దీంతో ఈ హీరో ప్రస్తుతం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తానేమి తప్పుచేయలేదని, న్యాయం కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అని, ఉన్ని.. సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఆరోపణతో ఉన్ని ముకుందన్ పరువు పోయిందనే చెప్పాలి.
ఉన్ని.. మళయాళంలోనే కాదు తెలుగులో కూడా సుపరిచితుడే. ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నగా, విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత ఇతనికి తెలుగులో మంచి ఆఫర్లే వచ్చాయి. ఈ మధ్యనే సమంత నటించిన యశోద సినిమాలో విలన్ గా కనిపించాడు. ఇక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మాలికపురం చిత్రంలో అయ్యప్పగా కనిపించి అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ అందుకుంటున్న ఉన్ని ముకుందన్ ఈ కేసులో నుంచి బయటపడతాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.