Keerthi Suresh: మహానటి గొప్ప మనసు.. చిత్ర బృందం మొత్తానికి గోల్డ్ కాయిన్స్
Keerthy Suresh Expensive gifts To Dasara Unit: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్
ఈ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ మధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకొంది. ఇక ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్ డీ గ్లామర్ రోల్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో కీర్తి మంచి అనుబంధం ఏర్పరుచుకుంది. దీంతో దసరా చిత్ర బృందానికి కీర్తి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందట.
షూటింగ్ ఆఖరి రోజున కీర్తి సురేష్ చిత్ర యూనిట్ సభ్యులు అందరికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి మంచి మనసును చాటుకొందని సమాచారం. ఇక కీర్తి ఇందుకోసం దాదాపుగా ఏడు లక్షల రూపాయలను ఖర్చు చేసిందని కూడా వారు చెబుతున్నారు. ఈ చిత్రం కోసం కీర్తి చాలా కష్టపడిందని, తన పాత్ర అభిమానులకు గుర్తుండిపోతుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి హిట్ ను సంపాదించుకొంటుందో చూడాలి.