Katrina Kaif: షాకింగ్.. కత్రీనా తల్లి కాబోతుందా..?
Katrina Kaif Pregnancy Rumors Viral In Social Media: బాలీవుడ్ అడోరబుల్ జంటల్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంట ఒకటి. వయసు రీత్యా ఇద్దరికీ తేడాలు ఉన్నా ప్రేమించి పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఎంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని ట్రై చేసినా ఈ జంట మాత్రం దాన్ని ఆపలేకపోయింది. ఇక వీరి పెళ్లైన మూడు నెలల తరువాత నుంచి కత్రీనా ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె వాటిని ఖండిస్తూనే ఉంది. ఇక కొత్త ఏడాది కూడా అదే రూమర్స్ మరోసారి గుప్పుమన్నాయి. అయితే ఈసారి మాత్రం వాటిని రూమర్స్ అనలేమనే చెప్పాలి.
అందుకు కారణం కత్రీనా లుక్.. నిత్యం హార్డ్ వర్క్ అవుట్స్ తో ఫిట్ గా ఉండే క్యాట్ తాజాగా కొంచెం బొద్దుగా కనిపించింది. ముంబై ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ముద్దుగుమ్మ ఎల్లో కలర్ టాప్ లో కొద్దిగా బరువు పెరిగినట్లు కనిపిస్తోంది. అంతేకాదు లూజ్ డ్రెస్ లో బేబీ బంప్ ను దాస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో కత్రీనా తల్లి కాబోతుంది అనే వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. మారె ఈసారైనా కత్రీనా బయటపడుతుందా..? ఇది కూడా సీక్రెట్ గా దాస్తోందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే క్యాట్, విక్కీ ప్రస్తుతం ఇద్దరు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.