Japan Glimpse:విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో కార్తి (Karthi) పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సిరీస్, సర్దార్ (Sardar) సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు.
Japan Glimpse:విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో కార్తి (Karthi) పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సిరీస్, సర్దార్ (Sardar) సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. సోలోగా `సర్దార్` మూవీతో రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తరువాత కార్తి నటిస్తున్న సినిమా యాక్షన్ డ్రామా `జపాన్`. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.ఎస్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.
విభిన్నమైన నేపథ్యంలో సాగే ఈ సినిమా గ్లింప్స్‌ని హూ ఈజ్ జపాన్ అంటూ ఇంట్రడక్షన్ వీడియోని హీరో కార్తి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. కార్తి నటిస్తున్న 25వ సినిమా ఇది. దీంతో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సౌట్ అండ్ ఔడ్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా సాగనున్న ఈ సినిమాలో హీరో కార్తి క్యారెక్టర్ కూడా చాలా భిన్నంగా సాగనుంది. `వాడు పాప క్షమాపణకు అతీతుడు ఫాదర్.. ప్రభు యొక్క అద్భుతమైన సృష్టిలో వాడొక హీరో ఫాదర్` అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది.
కర్లింగ్ హెయిర్..మెడలో డాలర్ లాకెట్..రేబాన్ గ్లాస్..ధరించిన డిఫరెంట్‌గా కనిపించే కార్తీని అంతా కామెడీగాడు అనుకుంటుంటారు. అతని చేష్టలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. `మీరనుకున్నట్టు కాదు..వాడు దూల తీర్చే విలన్..` అంటూ సునీల్ చెబుతున్న డైలాగ్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. `జపాన్ మేడ్ ఇన్ ఇండియా` అంటూ విచిత్రమైన వేషధారణలో కార్తి చెప్పే డైలాగ్‌లు, కార్తి హావ భావాలు కొత్తగా ఉన్నాయి. ఇంతకీ ఎవరీ జాపాన్? హీరోనా?..విలనా?.. అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కర్లీ హెయిర్‌తో, డిఫరెంట్ మేకోవర్‌తో కార్తి కనిపిస్తున్న తీరు కొత్తగా ఉంది. గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్ ఇదే గ్లింప్స్‌తో రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. యాక్షన్ అడ్వెంచర్‌గా సాగే ఈ సినిమాని దీపావలి సందర్భంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ వినేష్ బంగ్లన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.