Karthikeya 2: మరోసారి నిరాశపర్చిన నిఖిల్..
Karthikeya 2 Movie Release Postponed Again: హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక అత్యంత భారీ స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
జూలై 22న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మరోసారి మారింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. “క్షమించండి.. కార్తికేయ 2 సినిమా జూలై 22 న రిలీజ్ కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎవరైతే ప్రీమియర్స్ బుక్ చేసుకున్నారో వారి డబ్బులు వెనక్కి పంపించేస్తాను. క్షమించండి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నిఖిల్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. మరి ఈ సినిమా ఎందుకు పోస్ట్ పోనే అయ్యింది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఆగస్టులోనైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.