Karate Klayani:వెండితెరపై శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ఆశేష ప్రేక్షకాభిమానుల్ని అలరించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు(NTR Centenary Celebrations) తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు జరుపుకుంటున్నారు.
Karate Klayani:వెండితెరపై శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ఆశేష ప్రేక్షకాభిమానుల్ని అలరించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు(NTR Centenary Celebrations) తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న స్టార్ హీరో ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండటం పట్ల నటి కరాటే కల్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించింది.
దీంతో విగ్రహావిష్కరణ వివాదంగా మారింది. కృష్ణుడికి రూపంలేదా? మానవ రూపం కావాలా? అంటూ విరుచుకుపడింది. విగ్రహావిష్కరణని నిలిపివేయాలంటూ కోర్టుని ఆశ్రయించింది. తనకు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, ఇస్కాన్ సంస్థలు నిలిచాయి. కాగా ఈ వివాదంపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టుమ విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి మరోసారి ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
`జై శ్రీకృష్ణ. నువ్వు ఉన్నావు స్వామి` అంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేసింది. అంతే కాకుండా మరో సారి ఎన్టీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. `రావణాసుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కాబట్టి రావణ దహనం చేసేటప్పుడు నేను `ఎన్టీఆర్` రూపంలో పెట్టి కార్యక్రమం చేస్తే ఒప్పుకుంటారా?` అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా కరాటే కల్యాణి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో పాటు విగ్రహ మార్పులపై కూడా కల్యాణి సంచలన ఆరోపణలు చేసింది.
ఎన్టీఆర్‌గారి విగ్రహం వివాదం జరుగుతోందో.. అందరూ బాధపడాల్సిన విషయం ఇది. ఇప్పటికి కూడా ఇంకా వాళ్లు పట్టిన పట్టు విడవకుండా చాలా గట్టిగా చిన్న చిన్న మార్పులు చేస్తాము. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎలాగైనా సరే మేము తయారు చేసేశాం కాబట్టి ఇప్పుడు మార్చడం కరెక్ట్‌గా ఉండదు. వెంటనే పిల్లనగ్రోవి తీసేస్తాము..లేదంటే నెమలి పించం తొలగిస్తాము.. అంటూ మార్పులు చేసి ఏదైతే దుర్గార్గమైన ఆలోచన చేస్తున్నారో..దానికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ధర్మాసనం తీర్పుని వ్యతిరేకిస్తూ లకారం ట్యాంక్ బండ్‌పై ఏదైతే విగ్రహం పెట్టాలనుకుంటున్నారో అది తప్పు.
సినిమాల్లో ఎన్టీఆర్ గారు చాలా పాత్రల్లో నటించినప్పుడు బుగ్గన మచ్చ పెట్టుకుంటారు. ఇలా తీసేసి నేనే అని చూపిస్తుంటారు. అంతే మచ్చ పెడితే ఎన్టీఆర్ గారు కాదు..మచ్చ పెట్టకపోతే ఎన్టీఆర్‌గారు అని సినిమాల్లో చూపిస్తారు. అంటే ఇప్పుడు పిల్లనగ్రోవి తీసేస్తే శ్రీకృష్ణ పరమాత్మకాదు..నెమలి పించం తీసేస్తే సరిపోతుందా?.. విగ్రహం విషయంలో మా అందరి మనోబావాలని కించపరుస్తూ మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకా పెద్ద తప్పు. ఈ విషయంలో ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న అన్నగారిని అవమానిస్తున్నారు.
ఇలాంటి పిచ్చి పనులు ఇంకా ఇంకా చేస్తూ పీకల్లోతు కష్టాలని కొని తెచ్చుకోకూడదని పువ్వాడ అజయ్ కుమార్ కు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమాత్రం నియమ నిబద్ధత ఉన్నా ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండి విగ్రహావిష్కరణ చేయకండి. అలాగే విగ్రహం పెడతామని ముందుకుమ వెళితే మేము మీపై మరో కేసు పెడతామని, మళ్లీ అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని హిందువుల పక్షాన, యాదవుల ఆడబిడ్డగా తెలియజేస్తున్నాను` అన్నారు.