Karate Kalyani:సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ (ntr statue) ప్రతిష్టాపన ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. నేపథ్యంలో కరాటే కల్యాణి (Karate Kalyani) సీనియర్ ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేయడం, దానిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (maa)క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ కల్యాణిని సస్పెండ్ చేయడం తెలిసిందే.
Karate Kalyani:సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ (ntr statue) ప్రతిష్టాపన ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. నేపథ్యంలో కరాటే కల్యాణి (Karate Kalyani) సీనియర్ ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేయడం, దానిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (maa)క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ కల్యాణిని సస్పెండ్ చేయడం తెలిసిందే.ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్పై కరాటే కల్యాణి స్పందించారు. `మా` తనని సస్పెండ్ చేయడం బాధని కలిగించిందన్నారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని తెలిపారు.
తన నిజాయితీకి `మా` ఇచ్చిన బాహుమతిగా భావిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మే 16న ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే కరాటే కల్యాణి టైమ్ గడిచిపోయినా వివరణ ఇవ్వకపోవడంతో ఈ నెల 24న `మా` అసోసియేషన్ ఆమెని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.
తాజాగా దీనిపై కరాటే కల్యాణి స్పందించారు. `మా`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా ముందుగా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయితీకి తగిన బహుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. అయితే కృష్ణుడి రూపంలో మాత్రం వద్దని చెప్పాను. దీనికి నామీద ఎందుకు ఇంత కక్షగడుతున్నారు? అని ప్రశ్నించింది.
నా అనారోగ్యం బాగాలేక సమాధానం చెప్పలేకపోయాను. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని `మా`కు నోటీసులు పంపించాను. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. `మా` అసోసియేషన్ను కించపరచలేదు. నేను ఏ తప్పు చేయలేదు. బహుషా ఎవరి ఒత్తిడితో అయినా ఈ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు` అని తెలిపింది కరాటే కల్యాణి.