Emergency: ఇందిరా గాంధీ పాత్రలో అదరగొట్టేసిన కంగనా
Kangana Ranaut Is Unrecognisable as Indira Gandhi: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమా కోసం స్వయంగా కంగన కథ సిద్దం చేసుకొని స్వీయ దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభమయినట్లు తెలిపారు. ఇక ఈ టీజర్ లో కంగనా, ఇందిరా గాంధీ లుక్ ను అచ్చు గుద్దినట్లు దింపేసింది.
ఇందిర ఆహార్యాన్ని కంగన పిన్ టూ పిన్ దించేసింది. అచ్చంగా ఇందిరా గాంధీనే కిందకు దిగివచ్చిందా అని అనుకోక మానరు. ఎమర్జెన్సీ అనేది 1975లో జరిగిన యదార్థ సంఘటనల కథ. భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రం వివరిస్తుంది.ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పాత్రతో మరోసారి కంగనా తాను ఎలాంటి పాత్రనైనా పోషించగలదు అని నిరూపించుకొంది. ఈ లుక్ బావుందని అభిమానులు కంగనాపై ప్రశసంలు కురిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.