Jyothika:హీరోయిన్గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు జ్యోతిక.
Jyothika:హీరోయిన్గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు జ్యోతిక. హీరో సూర్య(Suriya)ని వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2009 నుంచి సినిమాల్లో నటించడం మానేశారు. అయితే సూర్య ప్రోత్సాహంతో 2015లో `36 వయదినిలే` సినిమాతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. జ్యోతిక ఇంత కాలం తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చారు.
ఇటీవలే చాలా కాలం తరువాత మలయాళ సినిమా అంగీకరించారు. తాజాగా హిందీ సినిమాకు ఓకే చెప్పారు. 22 ఏళ్ల తరువాత జ్యోతిక హిందీలో సినిమా చేస్తున్నండటం ఆసక్తికరంగా మారింది. 2015 నుంచి మహిళా ప్రధాన చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్న జ్యోతిక మరో సారి బాలీవుడ్ మూవీ చేయబోతున్నారు. ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్ కావడంతో జ్యోతికి ఓకే చెప్పింది. 22 ఏళ్ల క్రితం హిందీ సినిమాలో నటించిన జ్యోతిక మళ్లీ ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్ సినిమా చేస్తుండటం విశేషం.
మరో విశేషం ఏంటంటే ఇందులో అజయ్ దేవ్గన్, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. `శ్రీ`అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది. ప్రియదర్శన్ రూపొందించిన `డోలీ సజాకె రఖ్నా` సినిమాతో హీరోయిన్గా పరిచయమైన జ్యోతిక ఆ తరువాత `వాలి` సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. హిందీలో జ్యోతిక నటించిన రెండవ సినిమా `లిటిల్ జాన్`. ఈ మూవీ తరువాత హిందీలో జ్యోతిక మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు హిందీ సినిమా చేస్తోంది.