Jr Ntr:అభిమానులు అత్యుత్సాహం కొన్ని సార్లు అనర్థాలకు కారణంగా మారుతూ ఉంటుంది. మితిమీరిన చేష్టల వల్ల అభిమానులు నచ్చిన స్టార్ కోసం ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.
Jr Ntr:అభిమానులు అత్యుత్సాహం కొన్ని సార్లు అనర్థాలకు కారణంగా మారుతూ ఉంటుంది. మితిమీరిన చేష్టల వల్ల అభిమానులు నచ్చిన స్టార్ కోసం ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సానికి పోయి అరెస్ట్ కావడం చర్చినీయాంశంగా మారింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు మే 20న వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు కేసి కొంత మంది భారీ స్థాయిలో కేక్ కటింగ్‌లు నిర్వహిస్తే మరి కొంత మంది మరో రకంగా పుట్టిన రోజు వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. అయితే కొంత మంది ఫ్యాన్స్ మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి జైలు పాలయ్యారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ `సింహాద్రి`ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్‌ని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా రిలీజైన మే 20న కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్, సిరికృష్ణ అనే థియేటర్ల వద్ద అభిమానులు రెండు మేకలను వేట కొడవల్లతో నరికి ఆ రక్తాన్ని తారక్ ఫ్లెక్సీపై చిందించారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవి కాస్త పోలీసుల కంటపడటంతో ఈ సంఘటనకు పాల్పడిన 9 మంది ఎన్టీఆర్ అభిమానులని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ సమీపంలో మారణాయుధాలు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని వారిపై కేసు నమోదు చేసి 9 మంది అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదే రోజున యూకె వెస్ట్ లండన్‌లోని ఓ థియేటర్లో సింహాద్రి సినిమా ప్రదర్శన జరుగుతుండగా ఎన్టీఆర్ అభిమానులు క్రాకర్స్ పేల్చారు. ఒక్కసారిగా పేలిక క్రాకర్స్ తెరపై పడి మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.