Jr NTR and Kalyan Ram pay tributes to NTR: ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన జూ ఎన్టీఆర్, కళ్యాణ్‌రాం
Jr NTR and Kalyan Ram pay tributes to NTR: ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాంలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈరోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కొంతసేపు ఘాట్ వద్ద కూర్చొని తాతను స్మరించుకున్నారు. ఇక ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. రోగులకు పండ్లు పంచిపెడుతున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని కొనియాడుతున్నారు. పార్టీని స్థాపించిన తొమ్మిదినెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతం. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వివిధ పథకాలను రూపొందించి జాతీయ స్థాయిలో పేరుగాంచారు. కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్న తెలుగువాడుగా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.