NTR 30: అందాల అతిలోక సుందరి టాలీవుడ్ లోకి దిగేసింది
Janhvi Kapoor First Look Poster Out From NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లింది లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 అధికారికంగా ప్రకటించినా ఇప్పటివరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిమీద క్లారిటీ లేకపోవడంతో అందరు అనుమానాలే వ్యక్తం చేశారు. ఇక నేడు జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.
ఎన్టీఆర్ 30వ సినిమా టీమ్ ఆమెకి విషెస్ తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో జాన్వీ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో ఆమె చేయడమనేది ఖాయమనే విషయం స్పష్టమైపోయింది. ఇందులో జాన్వీ లంగావోణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఫిదా చేసేస్తోంది. ఇక, ‘తుఫానులో ప్రశాంతత’ అనే ట్యాగ్‌తో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అతిలోక సుందరి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.