Waltair Veerayya: చిరు నోట.. జంబ లకిడి జారు మిఠాయ సాంగ్.. మా ప్రెసిడెంట్ గారు ఏమంటారో..?
Jamba Lakidi Jaru Mithaya Song Sung By Chiranjeevi: నేను జడ యేస్తాను చూడు నేను జడ యేస్తాను చూడు.. నా జడ సైజ్ చూడకుండ తిసేస్తాను చూడు.. జంబలకిడి జారు మిఠాయ.. గతేడాది మోస్ట్ పాపులర్ సాంగ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒక మహిళ ఈ సాంగ్ ను పాడింది. ఏ ముహూర్తాన ఆమె ఈ సాంగ్ పాడిందో కానీ, దేశం మొత్తం ఈ పాట మోత మోగించేసింది. చిన్నా లేదు పెద్దా లేదు.. ముసలి లేదు ముతకా లేదు.. ఎక్కడ విన్నా జంబలకిడి జారు మిఠాయ అంటూ రీల్స్ చేసినవారే. ఇక ఈ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్లింది అంటే.. చివరికి మెగాస్టార్ చిరు నోట కూడా ఈ పాట వినిపించింది.
చిరు ఈ సాంగ్ పాడడా.. ఎక్కడ అని అంటే.. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు నోట జంబలకిడి జారు మిఠాయ సాంగ్ ను వినొచ్చు. ఈ సినిమాలో చిరు కామెడీ హైలైట్ అని చెప్పొచ్చు. సప్తగిరి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ గ్యాంగ్ తో చిరు చేసే కామెడీ, ఆ టైమింగ్ అద్బుతం.. ఈ కామెడీ సీన్స్ లో బిట్స్ బిట్స్ గా చిరు జంబలకిడి జారు మిఠాయ సాంగ్ ను పేరడీ చేసి లుంగీ తీసేస్తా చూడు.. అంటూ హమ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ సాంగ్ రావడం ఆలస్యం థియేటర్ పునకాలు తో ఊగిపోయారు. అయితే మరికొందరు మాత్రం చిరు, మోహన్ బాబు కుటుంబానికి సెటైర్ వేశారని చెప్పుకొస్తున్నారు. చిరు ట్రోల్ చేయడానికే ఈ సాంగ్ ను పెట్టించి ఉంటాడని చెప్పుకొస్తున్నారు. మా ఎలక్షన్స్ సమయంలో మెగా ఫ్యామిలీ కి మంచు ఫ్యామిలీ కి మధ్య గొడవలు జరిగిన విషయం తెల్సిందే. ఈ సాంగ్ పై మా ప్రెసిడెంట్ విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి అంటున్నారు.