Jailer:సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `జైలర్` చాలా ఏళ్ల తరువాత అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. రజనీ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కోసం ఇన్నాళ్లుగా ఎదురు చూశారో అదే స్థాయి సినిమా కావడంతో `జైలర్`కు బాక్సాఫీస్ వద్ద అభిమానులు, సినీ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
Jailer:సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `జైలర్` చాలా ఏళ్ల తరువాత అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. రజనీ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కోసం ఇన్నాళ్లుగా ఎదురు చూశారో అదే స్థాయి సినిమా కావడంతో `జైలర్`కు బాక్సాఫీస్ వద్ద అభిమానులు, సినీ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తొలి రోజు తొలి షో నుంచే `జైలర్` బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. సినిమాలో చాలా రోజుల తరువాత తలైవా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో అభిమానులు `జైలర్`కు ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విడుదలై 18 రోజులు దాటినా ఎక్కడా రజనీ మేనియా తగ్గడంలేదు. బాక్సాఫీస్ వద్ద అదే జోరుని చూపిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా `జైలర్` రికార్డు స్థాయిలో రూ.600 కోట్ల మార్కుని దాటడం విశేషం.
ఇదిలా ఉంటే `జైలర్` చుట్టూ సరికొత్త వివాదం మొదలైంది. సినిమాలోని ఓ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను రజనీకాంత్ హత మారుస్తారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై స్పందించిన ఆర్సీబీ టీమ్ నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నిర్వాహకులు ఈ సన్నివేశంలో మార్పులు చేయాల్సిందేనని కోర్టుని ఆశ్రయించారు. దీంతో `జైలర్` చుట్టూ వివాదం మొదలైంది. ఈ వివాదంపై వెంటనే స్పందించిన `జైలర్` టీమ్ ఆ సన్నివేశాలని మారుస్తామంటూ వివరణ ఇచ్చింది.
Jailer
దీంతో వివాదం సద్దుమనిగింది. సినిమాలోని ఓ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటాడు. దీన్ని గమనించిన రజనీ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇది ఆర్సీబీ నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారింది. తమ అనుమతి లేకుండా తమ జెర్సీని నెగెటివ్‌గా వాడారని `జైలర్` టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టుని సంప్రదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బయటే వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించింది.
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కాంప్రమైజ్‌కు వచ్చిన `జైలర్` టీమ్ సెప్టెంబర్ 1 లోపు సదరు సన్నివేశాలని మారుస్తామని, అలాగే టెలివిజన్, ఓటీటీల్లోనూ మార్చిన సన్నివేశాలని మాత్రమే ప్రదర్శిస్తామని కోర్టుకు వెల్లడించింది. దీంతో `జైలర్`పై మొదలైన ఆర్సీబీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. `జైలర్` బ్లాక్ బస్టర్ ఊపులో ఉన్న రజనీకాంత్ తన 170వ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. `జై భీమ్` ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, శర్వానంద్, మంజువారియర్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.