Rajini Jailer:తమిళ ఇండస్ట్రీకి చెందిన అగ్ర కథానాయకులు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు పదులు దాటినా ఇప్పటికీ బాక్సాఫీస్ ని రఫ్యాడించేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తరువాత `విక్రమ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్ హాసన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే.
Rajini Jailer:తమిళ ఇండస్ట్రీకి చెందిన అగ్ర కథానాయకులు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు పదులు దాటినా ఇప్పటికీ బాక్సాఫీస్ ని రఫ్యాడించేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తరువాత `విక్రమ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్ హాసన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. కమల్ కెరీర్‌లోనే ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. గత ఏడాది జూన్‌లో విడుదలైన `విక్రమ్` వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్లు రాబట్టి కమల్ సినిమాల్లో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
ఇదే ఫీట్‌ని ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన మేనియాతో తిరగ రాస్తున్నారు. రజనీకాంత్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ సినిమాల నిర్మాత కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో వసూళ్ల జాతరకు శ్రీకారం చుట్టిన `జైలర్` ఇప్పటికే అదే హవాను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద రజనీ ఫీవర్‌ని కంటిన్యూ చేస్తూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.
Jailer
రజనీ మేనియాతో ఐదు రాష్ట్రాల్లో ఏకంగా రూ.50 కోట్లు రాబట్టి ఈ ఘనతని సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు `కేజీఎఫ్ 2`, `బాహుబలి 2` సినిమాలు మాత్రమే ఈ ఘనతని సాధించాయి. ఇప్పుడు వాటి సరసన నాన్ సీక్వెల్ మూవీగా `జైలర్` అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. సినిమా విడుదలై 18 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.600 కోట్ల మార్కుని చేరుకుంది. ఇంత ఫాస్ట్‌గా రూ.600 కోట్ల క్లబ్‌లో చేరడం కూడా ఓ రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయినా సరే `జైలర్` ఫీవర్ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికీ రజనీ అభిమానులు థియేటర్లకు రికార్డు స్థాయిలో క్యూ కడుతూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తున్నారు. 18వ రోజు `జైలర్` రూ.10.25 కోట్లు కలెక్ట్ చేసిందంటే రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియా వ్యాప్తంగా రూ.300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.607.29 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. చాలా రోజుల తరువాత రజనీ సినిమా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేస్తుండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.