Adipurush:ఆదిపురుష్..దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) శ్రీరాముడిగా నటించిన తొలి మైథలాజికల్ డ్రామా
Adipurush:ఆదిపురుష్..దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) శ్రీరాముడిగా నటించిన తొలి మైథలాజికల్ డ్రామా కావడంతో సర్వత్రా ఈ మూవీపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అనుగుణంగా సినిమా ఉంటుందని మేకర్స్ 3డీ ట్రైలర్‌తో స్పష్టం చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో టి. సిరీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదిపురుష్ ఎట్టకేలకు జూన్ 16న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.
సీతగా కృతిససన్ నటిస్తుండగా, రావణాసుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలతో పాటు వివాదాల్ని తెచ్చి పెడుతున్నాయి. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం `ఆదిపురుష్` విజువల్ వండర్ అని విమర్శలని తిప్పికొడుతూ మేకర్స్‌కి ధైర్యాన్నిస్తున్నారు. రీసెంట్గా కొత్త పోస్టర్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మేకర్స్ శనివారం `జై శ్రీరామ్ జూఐ శ్రీరామ్` అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు.
పర్ ఫెక్ట్ రామ్ అంథెమ్గా ఈ పాట నిలవనుంది. ఇకపై ప్రతీ చోట, శ్రీరామ నవమి సందర్భంగా ఈ పాట మారుమోగడం ఖాయం. అజయ్ – అతుల్ సంగీతం అందించిన ఈ పాటకు మనోజ్ ముంతాషిర్ శుక్లా సాహిత్యం అందించారు. అదే పాటని తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ చేసిన గంటల వ్యవధిలో ఒక్క తెలుగులోనే దాదాపు వన్ మిలియిన్ వ్యూస్‌ని క్రాస్ చేస్తోంది.
జైశ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్..
నీ సాయం సదా మేమున్నాం..
సిద్ధం సర్వ సైన్యం..
సహచరులై సహా వస్తున్నాం..
సకలం స్వామి కార్యం..
మహిమాన్విత మంత్రం నీ నామం`
అంటూ సాగే ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించగా, అజయ్ – అతుల్ అద్భుతంగా ట్యూన్స్ చేశారు. పాట శ్రీరామ భక్తులని విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ పాటలోని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. హనుమంతుడితో శ్రీరాముడి పరిచయం.. తనని చూసి ఆత్మీయంగా శ్రీరాముడు ఆలింగనం చేసుకోవడం..అందుకు హనుమంతుడు పరవశించిపోవడం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆ తరువాత సన్నివేశాల్లో విళ్లు పట్టుకుని ప్రభాస్ నడుచుకుంటూ వస్తున్న సీన్స్ బాహుబలి దృశ్యాలని తలపిస్తున్నాయి.
ఈ పాట కోసం అజయ్ – అతుల్ వాడిన ఆస్కెస్ట్రా థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. లాంకా దహనం కోసం వారధిని నిర్మించే దృశ్యాలు.. రాముడి రాజసాన్ని వర్ణిస్తూ సాగే పదాలు బాగున్నాయి. శ్రీరామ భక్తులకు ఈ పాటు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న `ఆదిపురుష్` జూన్ 16న భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. 2023లో అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించనుందో వేచి చూడాల్సిందే.