kirrak RP: కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ కమెడియన్
Jabardasth Comedian Kirrak RP Started Curry Point: జబర్దస్త్ తో మంచి పేరుతెచ్చుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. నాగబాబుతో పాటు జబర్దస్త్‌ను వదిలేసి వెళ్ళిపోయిన ఆర్పీతాజాగా ఫుడ్ బిజినెస్ లోకి దిగాడు. కూకట్‌పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. నేడు పూజా కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక ఈ కర్రీ పాయింట్ స్పెషల్ ఏమిటంటే.. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. కట్టెల పొయ్యిఫై విలేజ్ లో వండినట్లు వండుతారట. రేట్లు కూడా చాలా రీజన్ బుల్ గా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. వ్యాపారంలో లాభాలు కలిసొస్తే మరో 15 బ్రాంచులు ఓపెన్ చేస్తానంటూన్నాడీ స్టార్ కమెడియన్.